మూడ్ లో కళావతి

పెళ్లి ఎవరిది అయితేనేం. సందడి మాత్రం మనదే అంటోంది కీర్తి సురేష్. బంధువుల పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు ఇటీవల కేరళ వెళ్లింది ఈ ముద్దుగుమ్మ. అక్కడ సరదా గడుపుతోంది. దానికి సంబంధించిన ఫోటోలు అభిమానుల కోసం షేర్ చేస్తుంది. అందమైన లొకేషన్స్ మధ్య మరింత అందంగా కనిపిస్తుంది. మరో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని కూడా ఈ వేడుకకు హాజరు కావడంతో.. ఇద్దరు కలిసి ఫోటోలకు పోజులిచ్చిన సంగతి తెలిసిందే. అయితే కీర్తి మాత్రం నాన్ స్టాప్ గా షో చేస్తోంది.

ట్రెండీ లుక్స్, చీర కట్టులో ఫోటో షూట్ చేస్తోంది. చూస్తుంటే కీర్తి పెళ్లికి పోయినట్టు లేదు. తన పెళ్లి చేసుకుంటునట్టు ఉంది. తాజాగా చీర కట్టులో దిగిన ఫోటోలు అభిమానులతో పంచుకుంది. అవి చూసిన నెటిజన్లు కీర్తి సురేష్ పెళ్లి మూడ్ లో ఉందని కామెంట్ చేస్తున్నారు. ఇటీవల ‘సర్కారు వారి’ పాట’ తో హిట్ కొట్టింది కీర్తి. సూపర్ స్టార్ మహేష్ బాబుకు సరిజోడి అనిపించుకుంది. ప్రస్తుతం కీర్తి వాషి (మలయాళం) ,మామన్నన్ (తమిళ్), దసరా, భోళా శంకర్ (తెలుగు) సినిమాల్లో నటిస్తోంది.

