ఎస్సై గల్లా పట్టిన రేణుకా చౌదరి

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌గాంధీల‌పై ఈడీ విచార‌ణ చేప‌ట్ట‌డాన్ని నిర‌సిస్తూ తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ రాజ్‌భ‌వ‌న్ ముట్ట‌డికి పిలుపునిచ్చింది. ఈ కార్య‌క్ర‌మం తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌద‌రి దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. దీంతో పోలీసులు షాక్‌కు గుర‌య్యారు. అలాగే కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు భ‌ట్టి విక్ర‌మార్క వెస్ట్‌జోన్ డీసీపీ జోయ‌ల్ డేవిస్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఒక ద‌శ‌లో ఆయ‌న్ని నెట్టేయ‌డం వివాదాస్ప‌ద‌మైంది.

ఖైర‌తాబాద్ స‌ర్కిల్ వ‌ద్ద టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి, జ‌గ్గారెడ్డి, గీతారెడ్డి, భ‌ట్టి విక్ర‌మార్క‌, మ‌హేశ్‌కుమార్‌, తెలంగాణ మ‌హిళా కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సునీతారావును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్య‌క‌ర్త‌లు రెచ్చిపోయారు. ఆర్టీసీ బ‌స్సు అద్దాల ధ్వంసం చేశారు. అలాగే ద్విచ‌క్ర‌వాహ‌నాన్ని కాల్చి వేశారు. రాజ్‌భ‌వ‌న్ వైపు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కురాలు రేణుకా చౌద‌రిని పోలీసులు అడ్డుకున్నారు. పంజాగుట్ట ఎస్ఐ ఉపేంద్ర‌ చొక్కా ప‌ట్టుకుని రేణుకా లాగారు.