జై బాలయ్య అంటున్న రామ్

బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో రామ్ హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన వార్త ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. రామ్ – బోయ‌పాటి సినిమాలో బాల‌య్య కూడా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. అట్లని బాలయ్య ఏమి నటించడం లేదు. జస్ట్ వినిపిస్తాడంతే. జై బాల‌య్య‌ నినాదం బాల‌య్య అభిమానుల‌కు ఇష్టం. బాల‌య్య ఉన్నా, లేక‌పోయినా… జై బాల‌య్య అనే పేరు ఓ మంత్రంలా జ‌పిస్తుంటారు. ఇక దర్శకుడు బోయపాటి బాలయ్యకు భక్తుడు అన్న విషయం తెలిసిందే.

రామ్ సినిమాలో ఆ భక్తిని చాటుకోబోతున్నాడట. బాల‌య్య అభిమానుల‌కు న‌చ్చేలా.. ఈ సినిమాలో జై బాలయ్య‌ నినాదాల‌తో మార్మోగిపోయేలా ఈ సినిమాలో ఓ ఎపిసోడ్ ని రూపొందించ‌నున్నాడ‌ట బోయ‌పాటి. ఈ సినిమాలో రామ్‌.. బాలయ్య అభిమానిగా క‌నిపించ‌నున్నాడ‌ని, ఓ స‌న్నివేశం మొత్తాన్ని బాల‌య్య రిఫ‌రెన్సుల‌తో.. నింపేశాడ‌ని టాక్.ఆ సీన్‌కు గూజ్‌బ‌మ్స్ రావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.