పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’
కొన్ని రోజులుగా ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా ఆర్మీ అభ్యర్థుల ఆందోళన, రైళ్ల దగ్ధం కారణంగా రవాణా నిలిచిపోయి పెట్రోల్, డీజిల్ సప్లై తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
వాస్తవానికి ఒకట్రెండు నెలలుగా పెట్రోల్, డీజిల్ కొరత స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఒకట్రెండ్ రోజులు అది మరింత ఎక్కువైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ సీజన్ మొదలైన నేపథ్యంలో రైతులు తమ టాక్టర్లకు డీజిల్ కోసం ఇక్కట్లు పడుతున్నారు. వచ్చే ఒకటిరెండు ట్యాంకర్లతో డీజిల్ కోసం రైతులు, ఇతర వాహనదారులు పెద్దఎత్తున గంటల తరబడి క్యాన్లతో పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నారు. దీంతో పెట్రోల్ బంకుల్లో వాహనదారులు కిక్కిరిసిపోయి గందరగోళ పరిస్థితి నెలకొంది.