కమర్షియల్ పోరి

హీరోయిన్స్ అంటేనే కమర్షియల్. ఇక పక్కా కమర్షియల్ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ రాశీఖన్నా కమర్షియల్ అయి ఉంటుంది. అయితే రియల్ లైఫ్ లో మాత్రం ఈ ముద్దుగుమ్మ పెద్దగా కమర్షియల్ కాదట. చాలా ఫ్రెండ్లీ హీరోయిన్. దర్శక-నిర్మాతలకు అన్ని విధాల సహకరిస్తుంది. అడిగినప్పుడు కాల్షీట్లు ఇస్తుంది. టైమ్ కు సెట్స్ కు వస్తుంది.

సినిమా పూర్తయిన తర్వాత తన పనైపోయింది అనుకోదు. సినిమా ప్రమోషన్ లో చురుకుగా పాల్గొంటుంది. అందుకే ఆమెను రిపీట్ చేయడానికి దర్శక-నిర్మాతలు ఇష్టపడతారు. ‘ప్రతిరోజూ పండగే’ తర్వాత మారుతి దర్శకత్వంలో ఆమె నటించిన సినిమా ‘పక్కా కమర్షియల్’. రవితేజతో అనుకున్న ఈ సినిమా గోపీచంద్ తో తెరకెక్కింది. జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న రాశీ.. మస్త్ గా పోజులు కొట్టింది. ఓ రేంజ్ లో అందాలు అరబోసింది.
