ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు గ్రీన్ సిగ్నల్
ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలలు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉపాధ్యాయుల పరస్పర బదిలీలపై సమీక్షించిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 2,558 మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు లబ్ధి పొందుతారని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపుల తర్వాత బదిలీల కోసం వివిధ శాఖలపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. ముఖ్యంగా ఉపాధ్యాయుల నుంచి పెద్ద ఎత్తువ అభ్యర్థనలు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చాయి. అయితే వివిధ అంశాలను పరిశీలించిన ప్రభుత్వం ఉద్యోగుల పరస్పర బదిలీలకు ఆమోదం తెలిపింది.