మహా సంక్షోభం : రెబల్‌గా మారిన 21 శివసేన ఎమ్మెల్యేలు

మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి సంక్షోభం దిశగా సాగుతున్నాయి. రాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ షిండే, తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి ‘అజ్ఞాతం’లోకి వెళ్లిపోయారు. అతడితో 12 మంది ఉన్నట్టు సమాచారం. అయితే 12 కాదు 20 మంది తన క్యాంపులో ఉన్నట్టు షిండే చెప్పినట్టు తెలుస్తున్నది. నిన్నజరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత శివసేన ఎమ్మెల్యేలు రెబల్ గా మారారు. ఈ జాబితాలో దాదాపు 21 మంది ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ సంఖ్య నిమిషాల్లో మారుతోంది.

మరోవైపు షిండే తన మద్దతుదారులతో కలిసి బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో శివసేన పార్టీ రంగంలోకి దిగింది. షిండేను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అటు తాజా పరిణామాలపై పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్‌ స్పందించారు. షిండే తమ పార్టీకి నమ్మకమైన వ్యక్తి అని, త్వరలోనే తమ ఎమ్మెల్యేలు తిరిగివస్తారని అన్నారు. మహా వికాస్‌ అఘాడీ కూటమిని కూల్చేందుకు చేస్తోన్న ప్రయత్నాలు ఫలించబోవని అన్నారు.