రాకెట్రీ.. నయా పోస్టర్

హీరో మాధవన్ మరో ప్రయోగం చేస్తున్నారు. మాజీ శాస్త్రవేత్త, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఏరోస్పేస్ ఇంజనీర్ నంబి నారాయణన్ జీవితం ఆధారంగా “రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్” పేరట సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం, నిర్మాత కూడా మాధవన్ నే.

తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఈ సినిమా తెరకెక్కించారు. అయితే తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా డబ్ వర్షన్ విడుదల కానుంది. జులై 1న రాకెట్రీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేసిన చిత్ర బృందం సోమవారం కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. మంచి కథ. కానీ దాన్ని కమర్షియల్ గా ఎలా డీల్ చేశారు అన్నదానిపైనే ఈ సినిమా ఫలితం ఆధారపడనుంది.