నయన్-విఘ్నేష్.. హనీమూన్ స్పెషల్ !

స్టార్ హీరోయిన్ నయనతార యువ దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమలో పడింది. వీరిద్దరు దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకొని.. ఈ నెల 9న ఏడడుగులతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత జరగాల్సిన పనులు కూడా అయిపోవడంతో ఈ జంట హానీమూన్ కి వెళ్లింది. థాయిలాండ్ లోవాలిపోయింది. అక్కడ సరదాగా గడుపుతోంది.

దానికి సంబంధించిన ఫోటోలు నయన్ అభిమానుల కోసం షేర్ చేసింది. హనీమూన్ నుంచి తిరిగొచ్చాక నయన్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ నటిస్తున్న సినిమా షూటింగ్ లో జాయిన్ కానుంది. ఇక విగ్నేష్ అజిత్ సినిమా పనులను షురూ చేయనున్నారు.