పెద్ద ప్రొడ్యుసర్.. రెండేళ్లు ఇబ్బంది పెట్టారు
చిన్న సినిమాలలో సత్తా చాటి, ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ ‘చాందినీ చౌదరి’. ‘కలర్ ఫోటో’తో తొలి విజయాన్ని అందుకుంది. కిరణ్ అబ్బవరం కు జంటగా ఆమె నటించిన సినిమా ‘సమ్మతమే’ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఓ టీవీ షో పాల్గొన్న చాందిన ఓ సంచలన విజయాన్ని బయటపెట్టింది. ఇండస్ట్రీకి చెందిన పెద్ద ప్రొడ్యూసర్ తనని రెండేళ్లు ఇబ్బందిపెట్టారని చెప్పింది.
“అతనో పెద్ద నిర్మాత. పేరు చెప్పను. రెండు సంవత్సరాలకి నాతో ప్రాజెక్టు సైన్ చేయించుకుని ఒక్క సీన్ కూడా షూట్ చేయలేదు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఆ రెండు సంవత్సరాలు నా ఎదుగుదలకు చాలా ఉపయోగపడేది. మంచి సినిమాలు మిస్ అయ్యాను. వేరే సినిమాలు చేసుకుంటానంటే ఆయన నన్ను బెదిరించారు. ఇండస్ట్రీకి కొత్తమ్మాయిని కావడంతో ఏం చేయలేకపోయా”నని చెప్పుకొచ్చింది. ఆయన కారణంగా కుమార్ 21 ఎఫ్, దృశ్యం, పటాస్ సినిమా ఆఫర్లు వదులుకోవాల్సి వచ్చిందని చెప్పింది.