మహా ‘అసెంబ్లీ రద్దు’ ?
మహా వికాస్ అఘాడీ కూటమి మహా సంక్షోభం నుంచి బయటపడేలా కనిపించడం లేదు. ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేయడం ఖాయమేనని తెలుస్తోంది. ‘అసెంబ్లీ రద్దు’ గురించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన ట్వీట్ ఈ ఊహాగానాలను మరింత బలపరుస్తోంది. ‘రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం.. విధాన సభ రద్దు దిశగా సాగుతోంది’ అని రౌత్ రాసుకొచ్చారు. దీంతో అఘాడీ కూటమి ప్రభుత్వం నుంచి దిగిపోవాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది.
ఈ సాయంత్రం జరిగే సమావేశంలో అసెంబ్లీ రద్దుపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. భేటీ అనంతరం అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. మరోవైపు, శివ సేన రెబల్ గ్రూప్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. పార్టీకి చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ముంబయి దాటి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది.