పూరి దంపతుల విడాకులు.. క్లారిటీ ఇచ్చిన అకాష్
పూరి జగన్నాథ్-లావణ్య దంపతులు విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాల వల్ల విడిపోవాలని నిర్ణయించుకున్నారని పలు వెబ్సైట్లలో వార్తలు వచ్చాయి. తాజాగా ఈ ప్రచారంపై ఆకాష్ పూరి స్పందించారు. ఆయన హీరోగా నటించిన చోర్ బజార్ ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆకాష్ పూరికి.. మీ తల్లిదండ్రులిద్దరూ విడిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. దానిపై ఏం చెప్పాలనుకుంటున్నారు?’’ అనే ప్రశ్న ఎదురైంది.
నిజంగా అలాంటి వార్తలు వచ్చినట్లు నాకు తెలియదు. అవన్నీ అవాస్తవాలు మాత్రమే. మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నాం. ఏం చేయాలో తెలియక కొంతమంది ఇలాంటి వార్తలు సృష్టించినట్లు ఉన్నారని ఆకాశ్ సమాధానమిచ్చారు. అమ్మ వాళ్లది ప్రేమ వివావాం. వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నప్పుడు నాన్న ఓరోజు ఆమెకు ఫోన్ చేసి.. ‘‘నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నీకు ఓకే అయితే వెళ్లిపోయి పెళ్లి చేసుకుందాం. అయితే నా వద్ద ఇప్పుడు కేవలం రూ.200 మాత్రమే ఉన్నాయి. రేపు నా భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా నీకు చెప్పలేను’’ అని చెప్పారట. దానికి ఆమె కంగారు పడకుండా ‘‘నేను వచ్చేస్తాను.. మనం వెళ్లిపోయి పెళ్లి చేసుకుందాం’’ అని ఇంట్లో నుంచి వచ్చేశారట. ఈవిషయాన్ని నాన్న నాతో ఓసారి చెప్పారు. వాళ్ల కథ విని నేనే ఆశ్చర్యపోయానని పూరి చెప్పుకొచ్చారు.