కవలలకు జన్మనిచ్చిన స్టార్ సింగర్
సింగర్ చిన్మయి శ్రీపాద పండంటి కవలలకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను ఆమె భర్త, నటుడు రాహుల్ రవీంద్రన్ అభిమానులతో పంచుకున్నారు. చిన్నారుల చేతులను ఫొటో తీసి, దాన్ని నెట్టింట షేర్ చేసిన ఆయన.. ‘‘ద్రిప్త మరియు శర్వస్… మా ప్రపంచంలోకి కొత్తగా వచ్చిన, జీవితాంతం మాతోనే ఉండిపోయే అతిథులు’’ అని రాసుకొచ్చారు.
ఒకే పరిశ్రమలో వేర్వేరు విభాగాలకు చెందిన ఈ ఇద్దరికీ కామన్ ఫ్రెండ్స్ వల్ల పరిచయం ఏర్పడింది. కొంతకాలానికే ప్రేమలో పడిన వీరు.. తమ బంధం గురించి ఇరు కుటుంబాల్లో చెప్పి.. పెద్దల అంగీకారంతో 2014లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. చెన్నైకు చెందిన చిన్మయి కోలీవుడ్, టాలీవుడ్‌లలో తెరకెక్కిన ఎన్నో చిత్రాలకు మధురమైన పాటలు ఆలపించారు. ముఖ్యంగా నటి సమంతకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ ఆమె వ్యవహరించారు.