ఒకే ఫ్రేములో కపూర్ భామలు

కపూర్ ఫ్యామిలీకి చెందిన యంగ్ హీరోయిన్స్ ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. బాలీవుడ్ ను ఏలుతున్న కుటుంబాల్లో కపూర్ కుటుంబం ఒకటి. కపూర్ ఫ్యామిలీలో యంగ్ జనరేషన్ కు ఢోకా లేదు. హీరోలు, హీరోయిన్లు గా రాణిస్తున్నారు. అయితే కపూర్ ఫ్యామిలీకి చెందిన యంగ్ బ్యూటీస్ జాన్వీ కపూర్, షానయా కపూర్, ఖుషి కపూర్ ఒకే ఫ్రేమ్ లో కనిపించి ఆకట్టుకున్నారు.

జాన్వీ కపూర్ ఇప్పటికే తనని తాను నిరూపించుకుంది. ఓ వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. వైవిధ్యమైన కథలతో ఆకట్టుకునే ప్రయత్నంలో ఉంది. ఇక ఆమె చెల్లెలు ఖుషి కపూర్ #TheArchiesతో తెరంగేట్రం చేయనుంది. షానయా కపూర్ #Bedhadak సినిమాలో హీరోయిన్ గా చేసింది. మొత్తానికి.. కపూర్ ఫ్యామిలీలో హీరోయిన్ల భవిష్యత్ బ్రహ్మాండంగా కనిపిస్తున్నది.
