కొడుకుతో కలిసి ఇళయరాజా.. ఫస్ట్ టైమ్ !

నాగ చైతన్య 22వ సినిమా షురూ అయింది. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. గురువారం జరిగిన పూజా కార్యక్రమానికి రానా దగ్గుబాటి, శివ కార్తికేయన్, బోయపాటి శ్రీను హాజరయ్యారు. ఫస్ట్ షాట్ కి బోయపాటి క్లాప్ కొట్టారు. 

ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం నాగ చైతన్య కు మొదటి తమిళ చిత్రం కాగా, వెంకట్ ప్రభు ఈ చిత్రంతో తెలుగులోకి అడుగుపెడుతున్నారు. కృతిశెట్టి హీరోయిన్. అబ్బూరి రవి డైలాగ్స్ అందిస్తున్నారు. జులై నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇతర వివరాలు త్వరలో చిత్ర యూనిట్ వెల్లడించనుంది. ఈ చిత్రానికి సంగీత దర్శకులైన తండ్రీ కొడుకులు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం విశేషం. వారిద్దరు కలిసి సంగీతం చేస్తున్న మొదటి చిత్రమిది.