జానీ డెప్‌నకు డిస్నీ నుంచి మళ్లీ పిలుపు.. రూ.2,535 కోట్ల ఆఫర్‌ !

విచిత్ర గెటప్‌, విభిన్న నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసి జాక్‌ స్పారోగా అలరించిన నటుడు జానీ డెప్‌. ప్రముఖ హాలీవుడ్‌ చిత్రాల నిర్మాణ సంస్థ డిస్నీ తన చిత్రాల్లో జానీ తిరిగి నటించేందుకు అతనికి ఏకంగా రూ.2,535 కోట్లను ఆఫర్‌ చేసిందట. గత కొన్ని రోజులుగా ఈ వార్త తెగ వైరల్‌ అయింది.

జానీడెప్‌-అంబర్‌ హియర్డ్‌ తొలిసారి ‘ది రమ్‌ డైరీ’ చిత్రంలో కలిసి నటించారు. అప్పటి నుంచి మొదలైన వారి స్నేహం ప్రేమగా, కొన్ని రోజులు ఇద్దరూ సహజీవనం చేశారు. 2015లో ఇరువురు వివాహం చేసుకున్నారు. కానీ, ఏడాది గడవక ముందే జానీడెప్‌పై గృహ హింస ఆరోపణలు చేస్తూ అంబర్‌ హియర్డ్‌ కేసు ఫైల్‌ చేసింది. ఈ క్రమంలో డిస్నీ అతడిని దూరం పెట్టింది. ‘పైరేట్స్‌ ఆఫ్‌ ది కరీబియన్‌’ సహా ఇతర ప్రాజెక్టుల నుంచి అతడిని తప్పించింది.

గృహ హింస ఆరోపణలు చేయడంతో తన పరువుకు భంగం వాటిల్లిందని ఆరోపిస్తూ జానీ డెప్‌కోర్టును ఆశ్రయించగా, అతడిని అనుకూలంగా తీర్పు వచ్చింది. అంబర్‌ హియర్డ్‌ 10.35 మిలియన్‌ డాలర్లు చెల్లించాల్సింది ఆదేశించింది. ఈ క్రమంలో జానీ డెప్‌నకు డిస్నీ నుంచి మళ్లీ పిలుపు వచ్చిందని, రూ.2,535 కోట్ల పారితోషికం ఆఫర్‌ చేసిందని వార్తలు వచ్చాయి తాజాగా దీనిపై జానీ డెప్‌ ప్రతినిధులు స్పందించారు. ఇవన్నీ కల్పిత వార్తలనీ కొట్టేపారేశారు. డిస్నీ నుంచి తమ హీరోకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని స్పష్టం చేశారు.