ఓటీటీ రిలీజ్.. 50 డేస్ కండీషన్ !

థియేటర్స్ లో రిలీజైన సినిమా నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. జూన్ 3న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అయిన కమల్ హాసన్ ‘విక్రమ్’ జులై 8 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. విరాటపర్వం అంతే. జూన్ 1న థియేటర్స్ లోకి వచ్చింది. జులై 1న ఓటీటీలోకి రాబోతుంది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఐతే దీని వలన థియేటర్స్ కు రావడానికి జనాలు ఆసక్తి చూపడం లేదని నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. 

థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాతే సినిమాలను ఓటీటీకి ఇచ్చేలా ఓ నిర్ణయానికి వచ్చారు. జులై 1 నుంచి ఒప్పందాలు చేసుకునే సినిమాలకు ఈ నిబంధన వర్తించనుంది. బుధవారం నిర్మాతలు సమావేశమయ్యారు. భారీ బడ్జెట్‌ చిత్రాల నుంచి చిన్న సినిమాల వరకు అన్నీ విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీలోకి వస్తుండటం థియేటర్ల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని పలువురు నిర్మాతలు వాపోయారు. ఓటీటీ రిలీజ్ విషయంలో 50 రోజుల నిబంధన తీసుకొచ్చారు. దీంతో తెలుగు సినిమాలు ఇకపై థియేటర్‌లోకి వచ్చిన 50 రోజుల తర్వాతే ఓటీటీల్లోకి వస్తాయి. నిర్మాతల నిర్ణయంపై మిక్సిడ్ టాక్ వినిపిస్తుంది. ఇది చిన్న సినిమాలకు పెద్ద నష్టం అంటున్నారు. అంతేకాదు.. ఈ నిబంధన కారణంగా డైరెక్ట్ ఓటీటీ లో రిలీజ్ అయ్యే సినిమాల సంఖ్య పెరగనుందని అంటున్నారు.