‘తండ్రైన.. దిల్ రాజు’ తాత !
నిర్మాత దిల్ రాజు తండ్రయ్యారు. ఆయన సతీమణి తేజస్విని బుధవారం ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో దిల్ రాజు దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దిల్ రాజు ఇప్పటికే తాత అయిన సంగతి తెలిసిందే. దిల్ రాజు కూతురికి పెళ్లైంది. పిల్లలు కూడా పుట్టారు. దీంతో.. దిల్ రాజు తాత మళ్లీ తండ్రియ్యాడని కొందరు నెటిజన్స్ సరదా కామెంట్స్ చేస్తున్నారు.
దిల్‌రాజు మొదటి భార్య అనిత అనారోగ్య సమస్యలతో 2017లో కన్నుమూశారు. మొదటి భార్య మరణానంతరం ఆయన వరంగల్‌కు చెందిన తేజస్వినిని రెండో వివాహం చేసుకున్నారు. కుటుంబసభ్యుల సమక్షంలో 2020లో వీరి వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీరికి మొదటి సంతానంగా బాబు పుట్టాడు.