బ్రేకింగ్ : మహా సీఎం ఉద్ధవ్‌ రాజీనామా

మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. విశ్వాస పరీక్షపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గురువారం బలం నిరూపించుకోవాలంటూ గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఆదేశాలను సుప్రీం సమర్థించింది. దీంతో గురువారం ఉదయం 11గంటలకు ఉద్ధవ్‌ నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాఢీ ప్రభుత్వం బలం నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే సుప్రీం తీర్పు వెలువడిన నిమిషాల వ్యవధిలోనే సీఎం ఉద్ధవ్ రాజీనామా చేశారు.

ఉద్ధవ్‌ నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాఢీ ప్రభుత్వం తిరిగి నిలబడుతుంది అనే నమ్మకం ఎవరికీ లేదు. అయితే ప్రభుత్వం పడిపోవడానికి, సీఎం ఉద్ధవ్ రాజీనామా చేయడానికి మరికొన్ని రోజుల సమయం పడుతుందని అనుకున్నారు. కానీ ఏక్‌నాథ్‌ శిందే వర్గం పక్కా ప్లాన్ తో ముందుకెళ్లడంతో అది సాధ్యం కాలేదు. మరోవైపు కొద్దిరోజుల నుంచే మహా సీఎం ఉద్ధవ్ రాజీనామా లేఖను రెడీ చేసి ఉంచుకున్నారు. ఇప్పుడు దానిని గవర్నర్ కు పంపించారు. రాజీనామా చేసినట్టు మీడియా ముందుకొచ్చి మరీ.. ప్రకటించారు.

మరోవైపు ఏక్‌నాథ్‌ శిందే వర్గంతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. శిందే వర్గంలోని 10 ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించిందని తెలుస్తుంది. అంతేకాదు.. దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి మహా సీఎం పీఠంపై కూర్చోబోతున్నారు. ఇక ఏక్‌నాథ్‌ శిందే త వర్గంతో కలిసి బీజేపీలో చేరుతారా ? లేక.. కొత్త పార్టీ పెడతారా  ? అన్నది ఆసక్తిగా మారింది.