మళ్లీ పనిలో పడ్డ నయన్

స్టార్ హీరోయిన్ నయనతార తిరిగి పనిలో పడ్డారు. ఈ నెల 9న ప్రియుడు విఘ్నేష్ శివన్ తో కలిసి ఏడడుగులు నడిచిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ జంట హనీమూన్ వెళ్ళింది. అక్కడ ఓ వారం పాటు సరదాగా గడిపిన ఈ జంట. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. హనీమూన్ పూర్తి చేసుకొని తిరిగొచ్చిన నయన్, విఘ్నేష్ మళ్లీ పనిలో పడ్డారు. నయన్ సడెన్ గా ముంబైలో దర్శనమిచ్చింది.

అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘జవాన్’ సినిమాలో నయన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. హనీమూన్ నుంచి తిరిగి రాగానే ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయింది నయన్. కారులో షూటింగ్ కు వెళ్లున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్  మారాయి. గతంలో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు నయన్ ప్రయత్నించింది. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ప్రభుదేవా రిఫరెన్స్ తో గట్టిగానే ట్రై చేసింది. కానీ వర్కవుట్ కాలేదు. ఐతే ఈ సారి అట్లీ నయన్ ను బాలీవుడ్ కి పరిచయం చేస్తున్నారు. నయన్ కు మాత్రమే కాదు.. దర్శకుడు అట్లీకి ఇదే తొలి బాలీవుడ్ సినిమా.