టెట్ ఫలితాలు.. తుది ‘కీ’ విడుదల
తెలంగాణ టెట్ తుది ‘కీ’ విడుదలైంది. టెట్ ఫలితాలను జులై 1న విడుదల చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఫలితాలకు రెండ్రోజుల ముందే అధికారులు తుది ‘కీ’ విడుదల చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పేపర్-1కు 3,18,506 (90.62శాతం), పేపర్-2కు 2,51,070 (90.35శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక త్వరలోనే ఫలితాలు విడుదల చేయనున్నారు.