గోపీ.. చాలా ప్రాక్టికల్ !

హీరో గోపీచంద్ చాలా ప్రాక్టికల్. ఆయన తండ్రి టి. కృష్ణ గొప్ప డైరెక్టర్. అయితే గోపీచంద్ ను కూడా మెగా ఫోన్ పట్టుకోవచ్చు కదా ! డైరెక్టర్ అయిపోవచ్చు కదా !! అని సలహాలు ఇచ్చేవారు చాలా మందే ఉన్నారు. పక్కా కమర్షియల్ ప్రమోషన్స్ లో పాల్గొన్న గోపీకి మరోసారి ఈ ప్రశ్నే ఎదురైంది. దానికి చాలా ప్రాక్టికల్ గా ఆన్సర్ చేశారు కమర్షియల్ హీరో.

“నాకు డైరక్షన్ కు సంబంధించి అన్ని విషయాలు తెలుసు. కానీ ఫుల్ మూవీ చేయాలంటే దర్శకుడిగా చాలా బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. దాని కోసం చాలా చేయాల్సి ఉంటుంది. నేను అంత ప్రిపేర్ అవ్వలేదు. పైగా డైరక్షన్ అనేది ప్రాక్టికల్ గా నాకు రాదు. రాని విషయాన్ని అనవసరంగా కెలకడం ఎందుకు?” అని గోపీ చెప్పుకొచ్చారు.

హీరోగా కెరీర్ మొదలు పెట్టిన గోపీచంద్.. విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మళ్లీ హీరోగా మారి నిలదొక్కుకున్నారు. ప్రస్తుతం మంచి పొజిషన్ లోఉన్నారు. అయితే గోపీ హీరోయిజం కంటే కూడా విలనీజం బాగుంటుందని ప్రేక్షకులు అంటుంటారు. అందుకే ఆయన మళ్లీ విలన్ గా నటిస్తే చూడాలని ఆశపడుతున్నారు. అది కూడా ప్రభాస్ సినిమాలో విలన్ గా నటించాలని కోరుతున్నారు. అందుకు గోపీచంద్ కూడా రెడీగా ఉన్నారు. కానీ మంచి కథ దొరకాలి అంటున్నారు.