బాలయ్య.. పెద్ద క్రాక్

మాస్ మహారాజా రవితేజ ను ‘క్రాక్’గా చూపించి హిట్ కొట్టాడు గోపీచంద్ మలినేని. క్రాక్ సినిమాలో ప్రతి సీన్ కు ఎలివేషన్, ప్రతి ఫైట్ కు ఎలివేషన్ వంటి టెక్నిక్ వాడారు. ఇప్పుడు బాలయ్యను పెద్ద క్రాక్ గా చూపించబోతున్నాడట గోపీచంద్ మలినేని. వీరి కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా (జై బాలయ్య -వర్కింగ్ టైటిల్) క్రాక్ స్టయిల్ లో సాగుతుందని సమాచారం.

తొలిసగంలోనే మూడు భారీ ఫైట్లు వుంటాయట. వాటిల్లో ఒకటి విదేశాల్లో భారీగా చిత్రీకరిస్తారని తెలుస్తోంది. సాధారణంగా ఫ్యాక్షనిస్ట్ ఫైట్లు అంటే కత్తులు, గొడ్డళ్లు వాడతారు. విదేశాల్లో అయితే తుపాకులు వాడతారు. కానీ ఈ సినిమాలో విదేశాల్లో ఫ్యాక్షనిస్ట్ ఫైట్ అన్నది స్పెషాలిటీ అని టాక్.  ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది.