హ్యాపీ బర్త్ డే.. కొత్త కాన్సెప్ట్

‘హ్యాపీ బర్త్ డే’ కొత్త కాన్సెప్ట్. ఈ సినిమాని హాఫ్ హార్టడ్ గా కాకుండా పరిపూర్ణంగా తీశారు దర్శకడు రితేష్ రానా. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని చెప్పడానికి కారణం ఇదే అన్నారు రాజమౌళి. బుధవారం తన చేతుల మీదుగా ”హ్యాపీ బర్త్ డే” ట్రైలర్ ని లాంచ్ చేశారు జక్కన్న.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ”జనాలు థియేటర్ కి రావడం లేదనే మాట వినిపిస్తుంది. అయితే ఏది చేసిన సంపూర్ణంగా చేస్తే ప్రేక్షకులు థియేటర్ కి వస్తారని నా విశ్లేషణ. కామెడీ చేస్తే జనాలు ఇరగబడి నవ్వేలా వుండాలి, ఫైట్స్ వున్న సినిమా తీస్తే గ్రేటెస్ట్ యాక్షన్ చూపించాలి. కానీ హాఫ్ హార్టడ్ గా సినిమాలు తీస్తుంటే జనాలు రావడం లేదు, సంపూర్ణంగా తీస్తే జనాలు వస్తారని భావిస్తున్నా. హ్యాపీ బర్త్ డే’ కొత్త కాన్సెప్ట్. బాగా తీశారని కితాబిచ్చారు.