రామ్‌తో గౌత‌మ్ మీన‌న్‌

రామ్, గౌత‌మ్ మీన‌న్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా ఓకే అయ్యింద‌ని టాక్‌. ఇటీవ‌ల రామ్, గౌత‌మ్ మీన‌న్ మ‌ధ్య క‌థా చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని, ఇద్ద‌రూ సినిమా చేయ‌డానికి ఓ అంగీకారానికి వ‌చ్చార‌ని టాక్‌. రామ్ ఈమ‌ధ్య త‌మిళ మార్కెట్ పై దృష్టి పెట్టాడు. లింగుస్వామితో.. ‘వారియ‌ర్‌’ సినిమా చేస్తోంది అందుకే. ఆ సినిమా తెలుగుతో పాటు త‌మిళంలోనూ విడుద‌ల కానుంది.

ఇప్పుడు గౌత‌మ్ మీన‌న్ రూపంలో మ‌రో త‌మిళ ద‌ర్శ‌కుడికి అవ‌కాశం ఇచ్చిన‌ట్టైంది. వారియ‌ర్ అయిన వెంట‌నే బోయ‌పాటి శ్రీ‌ను సినిమాని ప‌ట్టాలెక్కిస్తాడు రామ్. ఆ త‌ర‌వాతే గౌత‌మ్ మీన‌న్ సినిమా ఉంటుంది. గౌత‌మ్ మీన‌న్ ప్రేమకథల స్పెషలిస్ట్. ఆయనతో సినిమా చేస్తే యూత్ కి  మరింత దగ్గర కావొచ్చు. అంతేకాదు.. లవ్ స్టోరీలు రామ్ కు బాగా నప్పుతాయి. అందుకే తన ఆయన గౌతమ్ మీనన్ తో జత కట్టడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.