రౌడీ హీరో PK పోజ్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ ప్రేక్షకులకు ఫస్ట్ షాక్ ఇచ్చాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న పాన్ ఇండియా సినిమా  ‘లైగర్’ ఫస్ట్ లుక్ రిలీజైంది. ఇందులో కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్న రౌడీ హీరో న్యూడ్ గా దర్శనమిచ్చి ఆశ్చర్యపరిచాడు. కింద కేవలం ఫ్లవర్స్ అడ్డం పెట్టుకొని కనిపించాడు. సింపుల్ గా చెప్పాలంటే పీకే సినిమాలో అమీర్ ఖాన్ ఫస్ట్ లుక్ మాదిరిగా బోల్డ్ గా కనిపించాడు.

 “నా సర్వస్వం తీసుకున్న సినిమా ఇది. నటన పరంగా, మానసికంగా, శారీరకంగా నా మోస్ట్ ఛాలెంజింగ్ రోల్. నేను మీకు అన్నీ ఇస్తాను! త్వరలో. #లైగర్” అని విజయ్ ట్వీట్ చేశాడు. లైగర్ లో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే కథానాయికగా నటిస్తుంది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.