ధోనీ మోకాలికి చికిత్స
కొంతకాలంగా ధోనీ మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. కాల్షియం లోపం కారణంగానే సమస్య తలెత్తినట్లు తెలిసింది. అయితే కార్పోరేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్నా.. ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో రాంచీకి 70కి.మీ దూరంలో ఉండే ఆయుర్వేద వైద్యుడు టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌కు వైద్యం చేశాడు. దానికి రుసుముగా ధోనీ నుంచి వైద్యుడు కేవలం రూ.40 మాత్రమే తీసుకొన్నాడట.
ఇంతకుముందు ధోనీ తల్లిదండ్రులకు కూడా ఈయనే వైద్యం చేశాడు. అందుకే ధోనీ తన సమస్యకు ఆయుర్వేద వైద్యం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. గత నెల రోజుల నుంచి వైద్యం తీసుకుంటున్నాడని, ప్రతి నాలుగు రోజులకొకసారి వైద్యుడి వద్దకు వస్తున్నట్లు తెలిసింది.