డబ్బులిస్తే.. అంతే !

హీరోయిన్స్ అంటేనే కమర్షియల్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే రకం. ఇక ‘పక్కా కమర్షియల్’ టైటిల్ తో తెరకెక్కిన సినిమాలో హీరోయిన్ గా నటించిన రాశీఖన్నాకు భారీగానే పారితోషికం దక్కినట్టుంది. సినిమాలో, సినిమా ప్రమోషన్స్ లోనూ ఆమె ఎక్కువ స్పేస్ ఇచ్చారు. రిలీజ్ కు నెల రోజుల ముందు నుంచే షురూ చేసింది. శుక్రవారం సినిమా రిలీజైన రోజు కూడా గ్యాప్ ఇవ్వలేదు. ఈసారి కలర్ ఫుల్ డ్రెస్ లో క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది.

ఇక ‘పక్కా కమర్షియల్’ మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంది. రొటీన్ కథ అని మారుతి రిలీజ్ కు ముందే చెప్పేశాడు. కథ మాత్రమే కాదు.. కథనం కూడా రొటీన్ గా ఉందని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. అక్కడక్కడ మెరుపులు తప్ప.. సినిమా గ్రిప్పింగ్ గా సాగలేదు. ఐతే రాశీఖన్నా కు మాత్రం కావాల్సినంత స్పేస్ ఇచ్చాడు దర్శకుడు మారుతి. ఆమె నుంచి రావాల్సిన గ్లామర్ ను పూర్తి స్థాయిలో పిండుకున్నాడు.
