RC15 ఫస్ట్ లుక్.. అదుర్స్ !

గ్రేట్ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో #RC15 తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ కథానాయిక. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం అధికారి, సిటిజన్ అనే టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. సిటిజన్ టైటిల్ దాదాపు ఖరారైంది. త్వరలోనే టైటిల్ ను అనౌన్స్ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ లోగా #RC15  నుంచి రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది.  చరణ్ పర్సనల్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ చిన్న గ్లింప్స్ లా ఆ లుక్ ని రివీల్ చేశారు. ఇందులో చరణ్ హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. గ్యాంగ్ లీడర్ లో చిరంజీవి లుక్ ని పోలి ఉంది. జులపాల జుట్టు.. గడ్డెం లుక్ లో రఫ్ గా కనిపిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.