అడవిలో అల్లు అర్జున్.. వైరల్ !

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ని సెట్స్ మీదకు తీసుకెళ్లే పనిలో ఉన్నారు. ఇంతలో అల్లు అర్జున్ పుష్ప గెటప్ లో అడవిలో నడుచుకుంటూ వెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాటిని సింహం తో పోలుస్తూ బన్నీ ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.

మరోవైపు ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నిజంగానే ఫ్యామిలీ తో కలిసి బన్నీ అడవి బాట పట్టారా ? లేక తన విశాలమైన ఫామ్ హౌస్ లో సేద తీరుతున్నారా ? అన్నది తెలియాల్సి ఉంది. ఇక పుష్ప 2 కథను పూర్తి చేసే పనిలో సుకుమార్ ఉన్నారు. పార్ట్ 1 నుంచి ఎలివేషన్ సీన్స్ ఉండేలా తన టీమ్ తో కలిసి కసరత్తు చేస్తున్నారు. ఇక పుష్ప 2 లో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి కనిపించబోతున్నట్టు సమాచారం.