PS1 : ఐశ్వర్య రాయ్ ఫస్ట్ లుక్

చోళుల చరిత్రతో ప్రముఖ తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. ఇప్పుడీ.. ఈ నవల సినిమా తెరకెక్కుతోంది. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా తీసుకొస్తున్నారు. తొలి భాగం షూటింగ్ దాదాపు పూర్తయింది. తమిళంతో పాటు హిందీ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేసిన చిత్రబృందం ఒక్కో పాత్రను పరిచయం చేస్తోంది.

ఈ భారీ మల్టీస్టారర్ లో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష, శోభితా ధూళిపాళ, జయరామ్, ఐశ్వర్య లక్ష్మి, విక్రమ్ ప్రభు, అశ్విన్ కాకుమాను,  ఆర్. శరత్‌కుమార్, ఆర్. పార్తిబన్, ప్రభు, ప్రకాష్ రాజ్, రెహమాన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఐశ్వర్యరాయ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. నందిని పాత్రలో పజువూరు రాణిగా ఆమె కనిపించబోతున్నారని తెలిపారు. ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.