లావణ్య తొలి అనుభవం

అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి తొలిసారి యాక్షన్ లోకి దిగింది. గన్ పట్టి వీర లెవల్లో వీరంగం సృష్టించడం హ్యాపీ బర్త్ డే టీజర్, ట్రైలర్ లో చూశాం. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో రితేష్ రాణా తెరకెక్కించిన చిత్రమిది. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. జులై 8న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న లావణ్య పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

మొదటిసారి గన్ పట్టుకొని యాక్షన్ లోకి దిగడం గురించి మాట్లాడుతూ.. చాలా కొత్తగా. నేను రోజూ జిమ్, బాక్సింగ్ చేస్తాను. తొలిసారి తెరపై నా యాక్షన్ చూపించే అవకాశం దక్కింది. ఈ సినిమాని నేను ఎంజాయ్ చేస్తూ చేశా. గన్స్ మోయడం కష్టంగా అనిపించింది. ఇందులో అన్నీ నిజమైన తుపాకులే వాడాం. ట్రైలర్‌లో కనిపించే ఓ పెద్ద గన్ తొమ్మిది కేజీలకు పైనే ఉంటుంది. దాన్ని మోస్తూ షూట్ చేయడం అంత సులువు కాదని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం లావణ్య తమిళంలో అధర్వతో ఓ సినిమా చేస్తోంది. అది షూటింగ్ పూర్తయింది. ‘పులి మేక’ అనే వెబ్‌సిరీస్ లో నటిస్తోంది. మరి కొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయని అందాల రాక్షసి తెలిపింది.