అనారోగ్యంపై క్లారిటీ ఇచ్చిన శృతి
హీరోయిన్ శృతిహాసన్ అనారోగ్యానికి గురైనట్టు వార్తలొచ్చాయ్. ప్రస్తుతం ఆమె చికిత్స తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ ప్రచారంపై శృతి స్పందించింది. తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ ఓ వీడియో విడుదల చేశారు.
‘‘ఇటీవల సోషల్ మీడియా వేదికగా నా వ్యాయామానికి సంబంధించిన వీడియో పంచుకున్నా. పీసీఓఎస్ (పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్)ను ఛాలెంజ్‌గా తీసుకుని అలా చేశానని పేర్కొన్నా. ఆ పోస్ట్‌ను పూర్తిగా చదవకుండా కొన్ని మీడియా సంస్థలు నాకేదో తీవ్ర అనారోగ్య సమస్యలున్నాయంటూ రాశాయి. నాకు కొన్నేళ్ల నుంచి ‘పీసీఓఎస్’ ఉంది. అంతే తప్ప అంతకుమించి మరేం లేదు. ప్రస్తుతం నేను క్షేమంగానే ఉన్నా’’ అని శ్రుతిహాసన్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘సలార్’ (Salaar), #NBK107 (బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న చిత్రం) సినిమాలో నటిస్తున్నారు. ‘కేజీయఫ్’ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’, గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో ‘ఎన్బీకే 107’ తెరకెక్కుతున్నాయి.