సీతారామం..ప్రయోగమే !

 సీతారామం అనే ఫీల్ గుడ్ టైటిల్ తో భావుకత నిండిన ప్రేమకథను అందించే ప్రయత్నం చేస్తున్నారు హను రాఘవపూడి. ఇప్పటి వరకు బయటకు వచ్చిన పాటలు, ఫొటోలు, లుక్ లు అన్నీ కలిసి సీతారామం సినిమా పట్ల ఓ ప్రశాంతమైన భావం ఏర్పడేలా చేసాయి. హీరో దుల్కర్ సల్మాన్ వింటేజ్ లుక్ కానీ, హీరోయిన్ మృణాల్ హావ భావాలు కానీ అన్నీ ఎక్కడో టచ్ చేసేలా వున్నాయి.

 విక్రమ్, కేజిఎఫ్ 2, పుష్ప, అఖండ లాంటి భారీ బీభత్స, లౌడ్ మ్యూజిక్ తో కూడిన యాక్షన్ సినిమాలకు రోజులు నడుసున్నాయి అని సినిమా జనం లెక్కలు వేస్తున్న రోజుల్లో అతి సున్నితమైన భావోద్వేగాలతో కూడిన సినిమా రాబోతోంది. మరీ సీతారామం ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.