తేజ కొడుకు సినిమా.. 30 కోట్ల బడ్జెట్

దర్శకుడు తేజ త‌న‌యుడు ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. విక్ర‌మాదిత్య‌ పేరుతో తేజ వార‌సుడి ఎంట్రీ జ‌ర‌గ‌బోతోంది. దీనికి తేజ‌నే ద‌ర్శ‌కుడు. ఈ సినిమాకి రూ.30 కోట్ల బ‌డ్జెట్ అని తెలుస్తోంది. తేజ కెరీర్ లో భారీ బ‌డ్జెట్ చిత్ర‌మిదే. త‌న‌యుడు క‌దా అని.. రూ.30 కోట్లు ఖ‌ర్చు పెట్ట‌డం లేదు. కథ అలా డిమాండ్ చేసింది. ప్రీ ఇండిపెండెన్స్ నేప‌థ్యంలో జ‌రిగే క‌థ ఇది. ఆ వాతావ‌ర‌ణం సృష్టించ‌డానికి సెట్లు వేయాల్సిందే. కాబ‌ట్టి.. ఖ‌ర్చు పెరుగుతోంది.

నేనే రాజు – నేనే మంత్రి సినిమాకి రూ.15 కోట్లు అయ్యింది. ఆయ‌న కెరీర్‌లో తెర‌కెక్కించిన భారీ బ‌డ్జెట్ సినిమా అదే. అయితే కొడుకు సినిమా కోసం మాత్రం తేజ భారీగా ఖ‌ర్చు పెడుతున్నార‌ని టాక్‌. ఈ సినిమాలో కొంత‌మంది స్టార్ తారాగ‌ణాన్ని కూడా దించ‌డానికి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌ని తెలుస్తోంది. అందుకే ఇంత బ‌డ్జెట్ అవుతోంది. ప్ర‌స్తుతానికి స్క్రిప్టు లాక్ చేసేశారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్తారు.