వాణీ లవ్ లో రణ్ బీర్..! పాపం అలియా !!

రణ్ బీర్ కపూర్ – వాణీ కపూర్ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు కనిపిస్తుంది. వీరిద్దరు కలిసి నటించిన సినిమా ‘షంషేరా’ జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 1871లో సాగే ఈ కథ సంజయ్ దత్ వర్సెస్ రణ్ బీర్ ఉండబోతుందని ట్రైలర్ ను చూస్తే అర్థమవుతోంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో రణ్ బీర్, వాణీ ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. రణ్ బీర్ ఒళ్లో కూర్చొని వాణీ కపూర్ ఇచ్చిన స్టిల్స్ మతిపోగొడుతున్నాయి. వీరిద్దరు నిజంగానే లవ్ లో ఉన్నారంతా ఫీల్ కలుగుతుంది.

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ వాణీ కపూర్ చేసింది తక్కువ సినిమాలే. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. వరుసగా స్టార్ హీరోలతో రొమాన్స్ చేస్తోంది. దానికి కారణం ఆమె అందమే. సన్నజాజిలా ఉండే ఈ పొడుగుకాళ్ల సుందరి సినిమాల్లో, బయట కూడా గ్లామర్ షో చేయడానికి వెనుకాడదు. ఇప్పుడు రణ్ బీర్ తో కలిసి మస్త్ షో చేస్తోంది.