విలన్ పోరి.. Red Hot

సోషల్ మీడియాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఇన్ స్టా గ్రామ్ లో ఆమె ఫాలోవర్స్ సంఖ్య  51.8 మిలియన్స్. ఇక ట్విట్టర్ లో 7.3 మిలియన్ ఫాలోవర్స్ ని కలిగి ఉంది. వారిని ఎప్పుడూ డిస్సపాయింట్ చేయదు.. ఈ ముద్దుగుమ్మ. రోజుకో సినిమా అన్నట్టుగా.. ప్రతిరోజూ పటానీ నుంచి సరికొత్త ఫోటోలు, వీడియోలు క్యూ కడుతుంటాయి.

సినిమా ప్రమోషన్స్ , అవి లేకపోతే స్పెషల్ ఫోటో షూట్స్ తో అభిమానుల కడుపు నింపడం పటానీకి అలవాటు. అర్జున్  కపూర్, దిశా పటానీ ప్రధాని పారల్లో నటించిన ఏక్ విలన్ రిటర్న్స్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేసింది పటానీ. తనదైన శైలిలో హాట్ హాట్ గా ముస్తాబై కెమెరా ముందుకొచ్చింది. ఓ రేంజ్ లో గ్లామర్ షో చేసింది. వెరైటీ భంగిమలో అందాలు ఆరబోస్తూ.. మైకంలో కనిపించింది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం పటానీ యోధ, KTina, ప్రాజెక్ట్ కె చిత్రాల్లో నటిస్తోంది.