హే వాట్సాప్‌.. వాడొద్దు

హే వాట్సాప్‌ వాడొద్దని వాట్సాప్ యాజమాన్యమే వినియోగదారులను అలర్ట్ చేస్తోంది. ఇక్కడ వాట్సాప్ వేరు హే వాట్సాప్ వేరు. ఇది కొత్తగా వచ్చిన యాప్. వాట్సాప్ లో ఉన్న ఫీచర్లు అన్ని ఇందులో ఉంటాయి. కొత్త ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. అయితే ఇది అంత సురక్షితం కాదు. హే వాట్సాప్ పట్ల జాగ్రత్తగా ఉండాలని వాట్సాప్ యాజమాన్యం సూచిస్తోంది.

గత కొన్ని రోజులుగా టెక్‌ సర్కిల్స్‌లో, ఆన్‌లైన్‌లో ఓ యాప్‌ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అదే ‘హే వాట్సాప్‌’. ఈ యాప్‌ను ‘హే మోడ్స్‌’ అనే డెవలపర్‌ రూపొందించారు. వాట్సాప్‌ సీఈవో విల్‌ కాథ్‌కార్ట్‌ దీనిపైనే వినియోగదారులకు సూచనలు, జాగ్రత్తలు చెప్పారు. ‘‘వాట్సాప్‌ పేరుతో వస్తున్న ఎలాంటి నకిలీ యాప్‌లను వాడొద్దు. ఒకవేళ వాడితే మీరు చాలా ఇబ్బందుల్లో పడతారు’’ అంటూ విల్‌ హెచ్చరించారు. ఇలాంటి నకిలీ యాప్‌ల వల్ల వ్యక్తిగత సమాచారం తస్కరణకు గురవుతుందని తెలిపారు.