కృష్ణవంశీ SILK
టైటిల్ చూడగానే కృష్ణవంశీ ఏంటీ సిల్క్ స్మిత బయోపిక్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ? అనుకునేరూ.. ! ఈ మేటరు వేరు. కృష్ణవంశీ SILK
పేరుతో ఓ ఆడియో కంపెనీ మొదలెట్టారు. రంగమార్తండ
పాటలు ఈ కంపెనీ నుంచే విడుదల అవుతాయి.
‘SILK’ అంటే ఎబ్రివేషన్ కూడా ఉంది. ఇందులో ‘S’ అంటే సీతారామశాస్త్రి. ‘IL’ అంటే ఇళయరాజా. ‘K’ అంటే కృష్ణవంశీ. కృష్ణవంశీకి సీతారామశాస్త్రి అంటే చాలా ఇష్టం. ప్రేమ. సిరివెన్నెల సీతారామ శాస్త్రికి ఆయన దత్తపుత్రుడు. మరోవైపు ఇళయరాజాకి వీరాభిమాని. అలా తనకు ఇష్టమైన ఇద్దరు వ్యక్తుల పేర్లతో, తన పేరుని ముడిపెడుతూ ఓ పేరు సృష్టించాడు కృష్ణవంశీ. ఇక కృష్ణవంశీ ఎన్ని ప్లాపులు సినిమాల్ ఇచ్చినా.. ఆయన నుంచి మరో సినిమా కోసం ఆతృతగా ఎదురు చూసే ప్రేక్షకగణం ఉంది.