బ్రహ్మాస్త్ర కథ ఇదే !

రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌, అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనిరాయ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన పాన్ ఇండియా సినిమా బ్రహ్మాస్త్ర. ఈ ఫాంటసీ అడ్వెంచర్‌ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. భారతీయ పురాణ, ఇతిహాసాల ఆధారంగా ఈ కథను రూపొందించారు.

ఈ సినిమాలో వినిపించే, కనిపించే అస్త్రాలు, వాటి వెనక ఉన్న పరమార్థాన్ని వివరిస్తూ తాజాగా ఓ కాన్సెప్ట్‌ వీడియో విడుదల చేశారు. అందులో వానరాస్త్ర, నంది అస్త్ర, ప్రభాస్త్ర, జలాస్త్ర, పవనాస్త్ర, బ్రహ్మాస్త్రాలకు సంబంధించి పురాణ గాథలు, వాటి శక్తిని గురించి ఇందులో వివరించారు. సెప్టెంబరు 9న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి సమర్పిస్తున్నారు.