బింబిసార.. అద్భుతమే

కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘బింబిసార’. వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హరికృష్ణ.కె నిర్మాత. గురుపౌర్ణమి సందర్భంగా బుధవారం ఈ చిత్రంలోని తొలి పాటని విడుదల చేశారు. ‘భువిపై ఎవడూ కనివిని ఎరుగని అద్భుతమే జరిగెనే… దివిలో సైతం కథగా రాని విధి లీలే వెలిగెనే…’ అంటూ పాట సాగుతోంది.
శ్రీమణి రచించిన పాట చాలా బాగుంటుంది. ఈ పాటని అంతే బాగా ఆలపించారు కాలభైరవ. చిరంతన్ మంచి బాణీ అందించారు. బింబిసారుడి యుద్ధం ఎలా ఉంటుందనేది ఆగస్తు 5 న థియేటర్స్ లో చూడబోతున్నారు ప్రేక్షకులు.