ఈ ఇద్దరికీ రౌడీనే కావాలి
బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఎప్పుడో పడిపోయిన సంగతి తెలిసిందే. విజయ్ తో డేటింగ్ చేయాలనుంది అని అప్పట్లోనే కుండబద్దలు కొట్టింది. అతడితో రొమాన్స్ చేసేందుకు తహతహలాడుతోంది. ఇప్పుడీ.. ఈ జాబితాలో మరో బాలీవుడ్ యంగ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ చేరింది.
సారా అలీఖాన్, జాన్వీకపూర్ కలిసి కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘కాఫీ విత్ కరణ్’ సీజన్-7లో పాల్గొన్నారు. త్వరలో ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో తాజాగా బయటకు వచ్చింది. నువ్వు ఎవరితోనైనా డేట్ చేయాలనుకుంటున్నావా?’ అని కరణ్ ప్రశ్నించగా.. ‘విజయ్ దేవరకొండ’ అని సారా సమాధానమిచ్చారు. అనంతరం ‘నువ్వూ విజయ్‌తోనేనా’ అని కరణ్.. జాన్వీని అడగ్గా ఆమె నవ్వుతో సమాధానమిచ్చింది.
తాజాగా ఈ వీడియో చూసిన విజయ్.. ‘‘మీ ఇద్దరికీ కౌగిలింతలు, ప్రేమ, ఆప్యాయతను పంపుతున్నా’’ అంటూ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఇక విజయ్ – అనన్య పాండే జంటగా నటిస్తున్న లైగర్ ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.