ఆత్మసాక్షి.. టీఆర్ఎస్’దే విజయం !
తెలంగాణ రాజకీయాలు ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి. ముందస్తు ఖాయం అంటూ అన్ని రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. మరోవైపు తెలంగాణలో సర్వేల సందడి నడుస్తోంది. పీకే టీమ్ ఎప్పటికప్పుడు సర్వే నిర్వహిస్తూ.. ఆ ఫలితాలను సీఎం కేసీఆర్ కు అందిస్తోంది. పీకే టీమ్ తో పాటుగా మంత్రులు, జిల్లా ఇన్ ఛార్జ్ లు విడివిడిగా సర్వేలు చేస్తున్నాని సమాచారం. ఇక మొన్ననే ఆరా మస్తాన్ అనే వ్యక్తి సర్వే వదిలాడు. ఆయన సర్వే చుట్టూ చాలా రచ్చ జరిగింది.
తీరా చూస్తే ఆయన బీజేపీ సభల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ‘ఆత్మసాక్షి’ గ్రూప్ సర్వే ప్రకటించంది. టీఆర్ఎస్‌దే గెలుపని ఆ సర్వేలో తేలింది. ఆత్మసాక్షి సర్వే ప్రకారం.. టీఆర్‌ఎ్‌సకు 39.5% ఓట్లతో 56 నుంచి 59 స్థానాలు రానున్నాయి. కాంగ్రె్‌సకు 31.5% ఓట్లతో 37 నుంచి 39 దాకా స్థానాలు వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి 21% ఓట్లు.. 14 నుంచి 16 దాకా సీట్లు వస్తాయని వెల్లడైంది. పలు జిల్లాల్లో టీఆర్‌ఎ్‌స-కాంగ్రె్‌సల మధ్యనే పోటీ ఉంటుందని.. కొన్ని జిల్లాల్లో మాత్రం మూడుపార్టీల మధ్య పోరు ఉంటుందని తేలింది. 1.88 లక్షల శాంపిళ్లను తీసుకున్నామని ఆత్మసాక్షి చెబుతోంది. అయితే ఆత్మసాక్షి సర్వే ఖాతాలో కొన్ని విజయాలు, కొన్ని ఫెల్యూర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి.. ఇది ఫైనల్ అని చెప్పడానికి లేదు. ఇకపై వారానికో సర్వే రాబోతుంది. అయితే ఎన్ని సర్వేలు చేసినా. ఎన్నికలకు నెల ముందు, పదిహేను రోజుల ముందు వచ్చే సర్వేల్లో కాస్తో.. కూస్తో నిజం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు ఈ అంకెల గారడీని వినాల్సిందే. విని తరాల్సిందే.