ఘూటైన విమర్శలకు నో.. పార్లమెంట్ లో ధర్నాకు నహీ !
కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొనే బలమైన ప్రతిపక్షం లేదు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ప్రభ రోజు రోజుకి తగ్గిపోతుంది. సొంత పార్టీ వ్యవహారాలు, కేసులు, విచారణలకు హాజరవ్వడంతోనే హస్తం పార్టీకి సరిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రజలే అసలు సిసలు ప్రతిపక్షంగా తయారయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఘూటైన విమర్శలు చేస్తున్నారు. అవి వైరల్ కావడం కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన అంశాలనే విపక్షాలు పార్లమెంట్ ఉభయ సభలు ప్రస్తావించడం.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీని ద్వారా ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్లిన అంశం.. ఈజీగా సర్కారు పరువు తీస్తోంది. అందుకే డైరెక్ట్ గా సోషల్ మీడియాను కంట్రోల్ చేయలేని కేంద్ర ప్రభుత్వం.. ఇన్ డైరెక్ట్ గా ఆంక్షలు విధిస్తున్నట్టు కనిపిస్తుంది