రజాకార్ ఫైల్స్.. బీజేపీ ఎన్నికల అస్త్రం ?

సినిమా కథకుడు విజయేంద్ర ప్రసాద్‌కు రాజ్యసభ సభ్యత్వం లభించింది. ఆయన్ని రాజ్యసభ కు పంపడంపై చాలా మంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. దేశానికి ఆయన చేసిన సేవ ఏంటీ ? అని ప్రశ్నించారు. ఈ విమర్శలు పక్కనపెడితే… ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్‌   బీజేపీ సొత్తు. రాజ్యసభకు నామినేట్ చేసిన తరవాత ఆర్ఆర్ఆర్ సినిమాలో పటేల్ మాత్రమే ఎందుకున్నారు.. గాంధీ, నెహ్రూ ఎందుకు లేరు అనేదానికి ఆయినిచ్చిన వివరణ బీజేపీ నేతలకు బాగా నచ్చింది. 

ఇప్పుడు ఆయనతో రజాకార్ ఫైల్స్ కథ రాయించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కాశ్మీర్ ఫైల్స్ బాగా భావోద్వేగాలను పెంచిందని.. ఆ తరహాలోనే సినిమా ఉండాలని బండి సంజయ్ భావిస్తున్నారు. కశ్మీరీ పండిట్ల జీవితాలను తెరపైకి తెచ్చినట్లే… రజాకార్ల దారుణాలను ప్రజలకు చూపించాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే నెల రోజుల ముందు… సినిమాను రిలీజ్ చేసేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివరిలో రజాకార్ల ఫైల్స్ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు.