‘ఫోన్ బూత్’ గ్యాంగ్.. హారర్

  స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ చిత్రం ‘ఫోన్ భూత్’. సిద్ధాంత్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్ హీరోలు. గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్టైనర్ గత ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఐతే కరోనా విజృంభణ నేపథ్యంలో షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఫైనల్ గా అక్టోబర్ 7న రిలీజ్ డేట్ ఫిక్సయింది.

ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేసిన చిత్రబృందం.. సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. కత్రినా కైఫ్ మధ్యలో అటు ఇటు ఇషాన్, సిద్ధాంత్ కూర్చున్న పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. అస్తి పంజారాలను పైన వేసుకొని భయపెడుతూనే నవ్వించే ప్రయత్నం చేసింది ఫోన్ బూత్ గ్యాంగ్. ఇక ఈ సినిమాలో కత్రినా కైఫ్ అందాల ఆరబోత ఓ రేంజ్ లో ఉండబోతుందని సమాచారం. యంగ్ హీరోలతో కలిసి కత్రినా చేసే కామెడీ కడుపుబ్బా నవ్విస్తుందని చిత్రబృందం చెబుతోంది.