క్లౌడ్ బరస్ట్ రీజనబులే ?
గోదావరికి వరదలు వస్తే విదేశీ కుట్ర ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. క్లౌడ్ బరస్ట్ అనే పదంతో చర్చ ప్రారంభమయ్యేలా చేశారు. దీంతో అందరూ ఇతర ప్రజాసమస్యలను వదిలేసి కేసీఆర్ క్లౌడ్ బరస్ట్‌పై చర్చ ప్రారంభించారు. బీజేపీ నేతలు .. కాంగ్రెస్ నేతలు ఆయనపై మండి పడుతున్నారు. ఆయనకు ఉన్న అవగాహన అదేనా ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని లోపలు ప్రజలు మర్చిపోయేలా కేసీఆర్ వేసిన ఎత్తుగడ ఇదని విమర్శలు చేస్తున్నారు.
దాంట్లో తప్పేమీ లేదు. కానీ ఇంతకు మించి కామెడీ చేసిన నేతలు ఇటీవలి కాలంలో ఉన్నారు. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ ముందుంటారు. మన యుద్ధ విమానాలు.. మేఘాల చాటున దాక్కుని పాకిస్థాన్ రాడార్లకు చిక్కకుండా.. వెళ్లి సర్జికల్ స్ట్రైక్స్ చేశాయని స్వయంగా ప్రధాని మోదీ ఓ ఇంటర్యూలో చెప్పారు.
అదే కాదు ఆ తర్వాత చాలా సార్లు ఆయన విజ్ఞాన ప్రదర్శన సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ కేసీఆర్ అన్న మాటల్లో కాస్త రీజనింగ్ ఉంది. ఎందుకంటే కొన్ని దేశాలు.. ఇలా కృత్రిమంగా వాతావరణ మార్పులతో శత్రుదేశాలపై అప్రకటిత యుద్ధం ప్రకటిస్తున్నాయని స్పష్టత ఉంది. కానీ అది దేశాన్ని మొత్తం వదిలేసి.. మిట్ట మధ్యలో ఉన్న తెలంగాణపై ఎలా ప్రయోగిస్తారు ? అన్నది పెద్ద ప్రశ్న.