నీట్ పరీక్ష.. లోదుస్తులు విప్పమన్నారా ?

ఆదివారం నీట్ పరీక్ష జరిగింది. అయితే కేరళలో నీట్ పరీక్ష నిమిత్తం పరీక్షా కేంద్రంలోకి వెళ్లేముందు నిర్వహించే తనిఖీల్లో భాగంగా లోదుస్తులు విప్పాలని సిబ్బంది బలవంతం చేసినట్లు కొందరు విద్యార్థినులు చేసిన ఆరోపణలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కొల్లాం జిల్లా ఆయుర్‌లోని మార్థోమా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో ఈ ఘటన జరిగింది. పరీక్షా కేంద్రం వద్ద తమను తనిఖీల పేరుతో లోదుస్తులు విప్పాలని సిబ్బంది సూచించారని బాధిత యువతి పేర్కొంది. లోదుస్తులు తీసేసిన తర్వాతే అనుమతించారని తెలిపింది. దీనిపై యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

దీనిపై నీట్‌ పరీక్షను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొంది. ‘పరీక్షా సమయంలో కానీ, తర్వాత కానీ ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదు. నీట్ పరీక్ష విషయానికొస్తే.. తల్లిదండ్రులు ఆరోపణలు చేసిన తరహాలో ఎలాంటి చర్యలను ఎన్‌టీఏ అనుమతించదు. వివిధ వర్గాల సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకునే ఈ పరీక్షలను నిర్వహిస్తాం’ అని ఎన్‌టీఏ ప్రకటన విడుదల చేసింది