బ్రహ్మాస్త్ర 2 : పార్వతీగా దీపికా పదుకొనె

అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫాంటసీ అడ్వెంచర్ ‘బ్రహ్మాస్త్ర’. మూడు భాగాలుగా రాబోతుంది. మొదటి భాగం “బ్రహ్మాస్త్ర పార్ట్-1 : శివ” సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

తాజాగా బ్రహ్మాస్త్ర పార్ట్-2 గురించి ఆసక్తికర అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. పార్ట్ – 2 లో దీపికా పదుకొనె కీలక పాత్రలో కనిపించనుంది. పార్వతీ పాత్రలో ఆమె నటించనుందని సమాచారం. బ్రహ్మాస్త్ర సిరీస్ లో మొత్తం మూడు సిరీస్ లు రాబోతున్నాయి. ఇక బ్రహ్మాస్త్ర పార్ట్ – 1లో కనిపించే అస్త్రాలు, వాటి వెనక ఉన్న పరమార్థాన్ని వివరిస్తూ ఇటీవల ఓ కాన్సెప్ట్ వీడియో విడుదల చేశారు. అందులో వానరాస్త్ర, నంది అస్త్ర, ప్రభాస్త్ర, జలాస్త్ర, పవనాస్త్ర, బ్రహ్మాస్త్రాలకు సంబంధించి పురాణ గాథలు, వాటి శక్తిని గురించి ఇందులో వివరించిన విషయం తెలిసిందే.