అమెరికన్ స్టార్ సింగర్ సీక్రెట్ గా నాలుగో పెళ్లి

అమెరికన్‌ సింగర్‌, నటి జెన్నీఫర్‌ లోపెజ్‌ మరోసారి పెళ్లిపీటలు ఎక్కింది. కొంతకాలంగా నటుడు బెన్‌ అఫ్లెక్‌, జెన్నీఫర్‌ డేటింగ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా జెన్నీఫర్‌ తన ఇన్‌స్టా‍గ్రామ్‌ వేదికగా వెల్లడించింది. ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ పెట్టుకున్న ఫొటోలను షేర్‌ చేస్తూ బెన్‌తో తన వివాహాన్ని అధికారికంగా ప్రకటిచింది.

జూలై 16న లాస్‌ వెగాస్‌లో ఈ జంటగా సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్టు తెలిసింది. 52 ఏళ్ల జెన్నీఫర్‌కు ఇప్పటికే మూడు పెళ్లిల్లు అయిన సంగతి తెలిసిందే. తాజాగా బెన్‌ అఫ్లెక్స్‌ను నాలుగవ వివాహం చేసుకుంది. ఈ జంటకు సహా నటీనటులు, ఫాలోవర్స్‌ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.